దక్షిణ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం

భారత భద్రతా దళాలకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కాశ్మీర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఎట్టకేలకు అంతమొందించారు.

Update: 2020-05-06 09:38 GMT

భారత భద్రతా దళాలకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కాశ్మీర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఎట్టకేలకు అంతమొందించారు.కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. అవంతిపోరాలోని బీగ్‌పోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. దాంతో మంగళవారం రాత్రి నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు బీగ్‌పోరా ప్రాంతంలో సంయుక్త బృందం ఉగ్రవాదులను గుర్తించాయి. ఈ క్రమంలో ఉగ్ర‌వాది రియాజ్ నైకూను దిగ్బంధం చేశాయి. . హిజ్బుల్ కమాండర్ భద్రతా దళాలు చిక్కుకున్నట్లు బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలో అతన్ని అంతమొందించినట్టు పలు ఆంగ్ల వెబ్ సైట్ లు వెల్లడించాయి.


Tags:    

Similar News