Jammu And Kashmir: మంచు దుప్పటి పరుచుకున్న జమ్ముకశ్మీర్

Jammu And Kashmir: స్నోతో ఆటలాడుతూ పర్యాటకుల సందడి

Update: 2023-01-01 13:00 GMT

Jammu And Kashmir: మంచు దుప్పటి పరుచుకున్న జమ్ముకశ్మీర్

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ మంచు దుప్పటి పరుచుకుంది. ఎక్కడికక్కడ పరిసరాలు మంచుతో నిండిపోవడంతో జమ్ముకశ్మీర్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ఆహ్లా్దకరమైన ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మంచుతో ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు స్నోను తొలగిస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు టూరిస్టులు మనాలికి పోటెత్తారు. మనాలి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు.

Tags:    

Similar News