Chennai Airport: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
Chennai Airport: చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
Chennai Airport: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
Chennai Airport: చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన సిబ్బంది, టెక్నీకల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు.
పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం.