ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్: తెరపైకి యాడిట్ ఏర్పాటు
SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో యాడిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.
SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో యాడిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు 40 కి.మీ. రెండు వైపులా టన్నెల్ పనులు చేస్తున్నారు. మరో 9 కిలోమీటర్లు టన్నెల్ పనులు జరిగితే సొరంగం పనులు పూర్తవుతాయి. పది రోజుల క్రితం ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. దీంతో యాడిట్ అంటే ద్వారం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇంత పెద్ద సొరంగంలో ఏదైనా ప్రమాదం లేదా ఏదేని ఇబ్బందులు జరిగితే మధ్యలో ఒక ద్వారం ఏర్పాటు చేయాలనే చర్చ అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులకు వచ్చింది. టన్నెల్ పనులు చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ మార్గం ద్వారా తప్పించుకోవచ్చు.దీన్ని ఒక రకంగా ఏస్కేప్ వే అని కూడా పిలుస్తారు.సొరంగం 25 కిలోమీటర్ల వద్ద ఈ ద్వారం ఏర్పాటు చేయాలని అధికారులు తలపెట్టారు. ఇది నల్లమల రిజర్వ్ ఫారెస్టులోని తిరుమలాపూర్ పరిధిలోకి వస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నందున యాడిట్ ఏర్పాటుకు కేంద్రం 1994 ఏప్రిల్ 22న అనుమతులు ఇచ్చింది.
తాజా ప్రమాదంతో మరోసారి యాడిట్ ఏర్పాటు అవసరంపై అధికారులు చర్చిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి 10 రోజులైనా ఇంతవరకు చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం 150 మంది మూడు షిఫ్టులుగా పనిచేస్తున్నారు.