ముజఫర్‌నగర్‌ ఆందోళకారులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశావాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

Update: 2019-12-22 09:43 GMT

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశావాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లోని ముజఫర్‌నగర్‌లో ఆందోళనలు తీవ్ర రూపందాల్చాయి. ఆందోళన కారులు ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను సీజ్‌ చేసింది. దీంతో ముజఫర్‌నగర్‌లో 67 మంది షాపులు ప్రభుత్వం సీజ్ చేసింది. త్వరలో వాటిని వేలం వేయనున్నాట్లు ప్రకటించింది. వేలం ద్వారా వచ్చిన నగదులో నష్ట్రాన్ని పూరిస్తామని వెల్లడించింది.

అంతేకాకుండా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం కూడా యూపీలోని 12 జిల్లాల్లో నిరసనలు చేశారు. దీంతో లక్నో, ముజఫర్‌నగర్‌, సంభాల్‌ ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 10 బైకులు, కార్లు తలగబెట్టారు.12 మంది పోలీసులు క్షతగాత్రులైయ్యారు. ఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సిరీస్ యాక్షన్ తీసుకోనుంది. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలలో రికార్డైన దృశ్యాలను‎ పరిశీలించనుంది. జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించేలా ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అయితే హింసకు కారణమైన వారిని గుర్తించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానిక పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. లక్నోలో బాధ్యులను గుర్తింస్తామని తెలిపారు. ఈ ఆందోళనలో 13 మంది మరణించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 705 మంది ఆందోళన కారులను అరెస్ట్‌ చేసి, 124పైగా కేసులు నమోదు అయ్యాయి. కాగా దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పంధించారు. ఆస్తుల విధ్వంసానికి ఏవరు కారణమో తెలుసుకుంటామని, వారి ఆస్తులను వేలం వేసి జరిగిన నష్టాన్ని భర్తిచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News