బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ విమర్శల వర్షం

మహారాష్ట్ర రాజకీయాలు ట్వీస్టుల మీద ట్వీస్టులు నడుస్తూన్నాయి. శనివారం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ అజిత్‌ పవార్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2019-11-24 06:49 GMT
Sanjay Raut Shiv Sena

మహారాష్ట్ర రాజకీయాలు ట్వీస్టుల మీద ట్వీస్టులు నడుస్తూన్నాయి. శనివారం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ అజిత్‌ పవార్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై శివసేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ విమర్శల వర్షం కురిపించారు. దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోలేరని స్పష్టం చేశారు. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీకి మద్దతుగా 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు.

శివసేన ప్రభుత్వాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీ వ్యవస్థ బీజేపీ జేబు సంస్థగా పనిచేస్తుందని ఆరోపించారు. గవర్నర్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంతానికి ఆరంభమని పేర్కొన్నారు. అజిత్ పవార్ పార్టీని మోసం చేశారని అన్నారు. గవర్నర్ కు ఎమ్మెల్యేల మద్దతుపై తప్పుడు సమాచారం ఇచ్చారని, వాటిని పరిగణంలోకి తీసుకొని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారని పేర్కొన్నారు.

గవర్నర్ కోరితే అసెంబ్లీలో బలనిరూపణకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. అజిత్ పవార్, శరద్ పవర్ కేకాదు పార్టీకూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అజిత్ పవర్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేదని, 50మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని సంజయ్ రౌత్ వెల్లడించారు.  

Tags:    

Similar News