మహారాష్ట్ర : అజిత్ పవార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్

అజిత్ పవార్ ను పార్టీ నుంచి బహిష్కరించేది లేనిది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Update: 2019-11-25 08:38 GMT
sarath pawar

మహారాష్ట్ర క్షణక్షణం రాజకీయాలు మలుపులు తీరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపడంతో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. బలపరీక్ష నిర్వహించాలని కోరాయి. ఈ కేసును సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఇది ఇలావుండగా మరోవైపు కాంగ్రెస్ -ఎన్సీపీ నేతలు గవర్నర్ కోశ్యారీని కలిశారు. తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం ముఖ‌్యనేతలు షీండే, చవాన్‌, వినాయక్‌ రావత్‌తో కలిసి గవర్నర్‌ను కలిశామని తెలిపారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని గవర్నర్ కు లేఖ ఇచ్చామని వెల్లడించారు. బీజేపీ తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, బీజేపీకి మెజార్టీ లేదని అభిప్రాయపడ్డారు. గవర్నర్ కోరితే తమ ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తామన్నారు.

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా స్పందించారు. బీజేపీకి మెజార్టీ లేని విషయం తెలిసిందేనని వ్యాఖ్యానించారు. గతంలో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తమకు ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదని గవర్నర్‌కు బీజేపీ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అజిత్ పవార్ ను పార్టీ నుంచి బహిష్కరించేది లేనిది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News