రామమందిర నిర్మాణానికి విరాళం ప్రకటించిన షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు

రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు.

Update: 2019-11-15 06:47 GMT
wasim rizvi

అయోధ్యలో రామమందిర నిర్ణాణానికి రంగం సిద్దమవుతోంది. రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి విరాళాం ఇస్తామంటూ ఉత్తరప్రదేశ్‌ చెందిన షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ముందుకొచ్చింది. రామమందిర నిర్మాణానికి రూ.51000 విరాళంగా ఇస్తున్నామని తెలిపింది. షియా సెంట్రల్‌ బోర్డు అధికారి వసీం రిజ్వీ ప్రకటించారు.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామ మందిర- బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం తెలిపింది. 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్‌కు ఇచ్చి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కోర్టు తెలిపింది. 1993 ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలమివ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో రామ మందిర నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్ట్‌నూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  

Tags:    

Similar News