మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మరికాసేపట్లో సోనియాతో భేటీ కానున్నారు.

Update: 2019-11-18 10:13 GMT
Sharad Pawar to meet Sonia Gandhi to discuss alliance with Shiv Sena

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మరికాసేపట్లో సోనియాతో భేటీ కానున్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో ఇది వరకే సమావేశమైన సవార్‌,తాజాగా సోనియాతో భేటీ అవ్వనున్నారు. రేపు మరోసారి కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలతో సమావేశమవుతారు. పదవులు, పంపకాలపై చర్చించనున్నట్టు సమాచారం.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలాఉంటే.. మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించనున్నారు.

అయితే 'అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయగా, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయని.. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారని.., శివసేన దారి ఎటువైపో వారే తేల్చుకోవాలంటూ పవార్‌ అన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న శివసేన ప్రకటన నిజమేనని తెలిపారు. కాగా.. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించిన తర్వాత ఇరు పార్టీలు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.


ఇదే వార్తను ఇంగ్లీష్‌లో చదవేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News