Gujarat: విషాదం.. నర్మదా నదిలో పుణ్యస్నానానికి వెళ్ళి ఏడుగురు గల్లంతు
Gujarat: ఒక డెడ్‌బాడీని రికవరీ చేసిన పోలీసులు
Gujarat: విషాదం.. నర్మదా నదిలో పుణ్యస్నానానికి వెళ్ళి ఏడుగురు గల్లంతు
Gujarat: గుజరాత్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామ సమీపంలోని నర్మదా నదిలో పుణ్యస్నానానికి వెళ్ళిన వారిని మృత్యువు వెంటాడింది. నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు నదిలో స్నానానికి వెళ్లిన 8 మందిలో ఒకరిని అక్కడే ఉన్న స్థానికులు కాపాడగలిగారు. మిగిలిన ఏడుగురు గల్లంతవగా.. ఒక డెడ్‌బాడీ గుర్తించారు. మరో ఆరుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారిలో 7 నుంచి 15 వయసున్న ఆరుగురు బాలురు ఉన్నట్టు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు పోలీసులు.