ఎస్‌బీఐ నుంచి త్వరలో రుపే క్రెడిట్‌ కార్డులు

ఎస్‌బీఐ నుంచి త్వరలోనే రుపే క్రెడిట్‌ కార్డు సేవలు ప్రారంభం కానున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఆఖరి ఒప్పందం పూర్తవగానే రుపే క్రెడిట్‌ కార్డు సేవలను మొదలుపెడతామని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్‌దయాళ్‌ ప్రసాద్‌ తెలిపారు.

Update: 2019-09-02 03:43 GMT

ఎస్‌బీఐ నుంచి త్వరలోనే రుపే క్రెడిట్‌ కార్డు సేవలు ప్రారంభం కానున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఆఖరి ఒప్పందం పూర్తవగానే రుపే క్రెడిట్‌ కార్డు సేవలను మొదలుపెడతామని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్‌దయాళ్‌ ప్రసాద్‌ తెలిపారు. భారత మార్కెట్లో రుపే క్రెడిట్‌ కార్డు ప్రాముఖ్యత సంపాదించుకుంటుందని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వినియోగదారులు కూడా రుపేలో క్రెడిట్‌ కార్డు సేవలు ప్రారంభించాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. రుపే కార్డు భారత్‌తో పాటు సింగపూర్‌, భూటాన్‌, యూఏఈ, బహ్రెయిన్‌, మాల్దీవుల్లో వాడుకోవచ్చని ప్రసాద్‌ గుర్తుచేశారు. ఎస్‌బీఐ కార్డుకు జూలై నెలాఖరుకు 90 లక్షల మంది వినియోగదారులున్నారని.. మార్కెట్లో తమ కార్డు 17.9 శాతం వాటా కలిగి ఉందని ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News