SBI: ఎన్నికల బాండ్ల వివరాలను కోర్టుకు సమర్పించిన ఎస్బీఐ

SBI: 22,217 ఎన్నికల బాండ్లు జారీ చేసినట్లు ఎస్బీఐ వెల్లడి

Update: 2024-03-13 12:12 GMT

SBI: ఎన్నికల బాండ్ల వివరాలను కోర్టుకు సమర్పించిన ఎస్బీఐ

SBI: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు SBI తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను SBI మంగళవారం రోజున ఈసీకి అందజేసింది. తాజాగా దీనిపై బ్యాంకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ సమర్పించింది. బాండ్లను ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు ఏ పార్టీలు ఎంత ఎన్‌క్యాష్‌ చేసుకున్నాయి వంటి వాటిని కోర్టుకు అందించారు SBI ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌. ఏప్రిల్‌ 1, 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22 వేల 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 22 వేల 30 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసుకుని నిధులు తీసుకున్నట్లు తెలిపింది. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్‌ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు.. ఈ నెల 15 సాయంత్రం 5గంటల్లోగా ఈసీ ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బహిరంగపరచాల్సి ఉంది.

Tags:    

Similar News