శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరుపై తమకు అనుమానాలు లేవన్నారు. డిసెంబర్ లోనే శివసేన నేృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన తెలిపారు.

Update: 2019-11-19 07:56 GMT
Sanjay Raut Shiv Sena

మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శివసేన మధ్య మాటలయుద్ధం జరుగుతుంది.ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరుపై తమకు అనుమానాలు లేవన్నారు. డిసెంబర్ లోనే శివసేన నేృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన తెలిపారు. శరద్‌పవర్‌తో శివసేన నేతలు కలిసి త్వరలోనే ప్రధానమంత్రి మోదీని కలుస్తామని, రైతుల సమస్యలను గురించి మోదీ విన్నవిస్తామని సంజయ్ రౌత్ చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని ఆ పార్టీ వ్యాఖ్యానించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేనకు 170మంది ఎమ్మెల్యేల మద్దతు ఎలా ఉందో ఆపార్టీ నాయకులే చెప్పాలంటూ పవర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై తమ మధ్య చర్చలు జరగలేదని పవర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో నవంబర్ 12న గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో గవర్నర్ పాలన కొనసాగుతోంది. లోక్ సభ సమావేశాల్లోనూ ప్రతిపక్ష స్థానాల్లో శివసేన ఎంపీలు కూర్చున్నారు. 

Tags:    

Similar News