మహిళా భక్తులకు అనుమతి లేదు.. వెనక్కి వచ్చిన 10 మంది ఏపీ భక్తులు

Update: 2019-11-17 09:31 GMT
Kerala cops block entry of women below 50

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశంపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం మండల-మకరు విలక్కు పూజల భారీ భద్రత నడుమ కోసం అక్కడ మణికఠుని ఆలయాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కొండపైకి మలధారణ చేసిన స్వాములతోపాటు భక్తులను అయప్పస్వామి దర్శనం కోసం పోలీసులు అనుమతించారు.

అయ్యప్ప స్వామి గుడిలో పడిపూజా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత గర్భగుడిలో మహేశ్‌ మోహనరారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాములంతా ఇరుముడులతో పదునెట్టాంబడి ఎక్కి భక్తులు చేరుకున్నారు. గత సంవత్సరం సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసలు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పది మంది మహిళా భక్తులను తిరిగి పంపించారు.

ఇరుముడితో దీక్ష ధరించిన వారికి ఐదు కిలోమిటర్ల దూరంలో నిలిపివేశారు. పంబా నది వద్ద వారిని నిలిపివేశారు. దీంతో కొద్దీసేపు పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రగడ జరుగుతుందని, దానిపై నెలకొన్న ప్రస్తుత పరిస్థిలు పోలీసులు వారికి వివరించారు. దీంతో వారు వెనుదిరిగారు. వీరంతా విజయవాడకు చెందిన మహిళా భక్తులు కావడం అందరూ 50 ఏళ్ల లోపు వయస్సు వారు కావడంతో వారిని అనుమతించలేదు. కేరళ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కేరళ ప్రభుత్వం మాత్రం ఈ సారి ఎలాంటి ఆందోళనలకు తావివ్వరాదని నిర్ణయించింది మాత్రం ఈ సారి ఎలాంటి ఆందోళనలకు తావివ్వరాదని నిర్ణయించింది

Tags:    

Similar News