Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

Tamil Nadu: గాయపడిన వారిని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

Update: 2024-05-16 02:35 GMT

Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

Tamil Nadu: తమిళనాడులోని చెంగల్‌పట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచ్చి- చెన్నై జాతీయ రహదారిపై 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు...ఓవర్ టేక్ చేయబోయి ముందు వెళ్తున్న టక్కును ఢీ కొట్టింది. దాని వెనకాలే వస్తున్న మరో ప్రభుత్వ బస్సు...ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే 4గురు ప్రయాణికులు మృతి చెందగా...మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రైవేట్ బస్సు ఎడమవైపు మొత్తం ముక్కలైపోయింది. ప్రభుత్వ బస్సులోని డ్రైవర్‌తో సహా మిగితా ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.

Tags:    

Similar News