Rajasthan: రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లోనే మృతి
Rajasthan: మరో ఆరుగురికి తీవ్రగాయాలు
Rajasthan: రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లోనే మృతి
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ - ఆగ్రా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. అతివేగంతో వెళ్తోన్న బొలెరో, థార్ వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను బొలెరో వాహనంలో ప్రయాణిస్తోన్న ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక థార్ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫ్యామిలీగా గుర్తించారు. ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి ఎదురుగా వస్తోన్న వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.