Delhi: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన బస్సు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Delhi: అదుపుతప్పి వాహనాలను ఢీకొన్న బస్సు

Update: 2023-11-05 11:30 GMT

ఢిల్లీలో బీభత్సం సృష్టించిన బస్సు..ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణిలో బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు... పలు వాహనాలను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు అదుపు తప్పడంపై గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News