ఠాక్రేకు గుడ్‌న్యూస్: ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు పెద్ద ఊరట లభించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు పెద్ద ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 28 లోపు జరుపుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖకు బదులిచ్చింది. దీంతో ప్రస్తుతం ఏ సభలో సభ్యుడిగా లేని ఉద్ధవ్ థాకరే కు ఎమ్మెల్సీ మార్గం సుగమం అయింది. వాస్తవానికి ఈనెల 28 కు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరునెలలు అవుతుంది..
ఈ లోపే ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది. లేదంటే ఆయన పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలో ఉన్న తొమ్మది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఠాక్రే మండలికి ఎన్నిక కానున్నారు. దాంతో సీఎం పదవిలో కొనసాగేందుకు ఠాక్రేకు మార్గం సుగమం అయినట్టయింది.