Coronavirus: ఇటలీలో అత్యధిక 'కరోనా వైరస్' మరణాలకు కారణం ఇదే..!

ఇటలీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 10,023 మరణాలు ఒక్క ఇటలీలోనే నమోదయ్యాయి.

Update: 2020-03-29 01:37 GMT
Coronavirus deaths in Italy

ఇటలీ లో కరోనా వైరస్  విజృంభిస్తోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 10,023 మరణాలు ఒక్క ఇటలీలోనే నమోదయ్యాయి.ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 10,023 మరణాలు ఒక్క ఇటలీలోనే నమోదయ్యాయి.ఒక్క శనివారమే భయంకరమైన మైలురాయిని దాటింది, శనివారం 889 మరణాలు నమోదయ్యాయని ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. 92,472 ధృవీకరించబడిన కేసులతో, ఇటలీ.. గ్రహం మీద అత్యధిక మరణాల రేటును కలిగి ఉంది. మహమ్మారికి కేంద్రంగా ఉన్న చైనాతో పోల్చితే ఇది తక్కువే.. చైనా 81,997 ధృవీకరించబడిన కేసులను కలిగి ఉంది, కాని ఇక్కడ మూడవ వంతు మరణాలు అంటే 3,299 ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

యునైటెడ్ స్టేట్స్ తరువాత ఇటలీ ఇప్పుడు ప్రపంచంలో రెండవ అత్యధిక కేసులను కలిగి ఉంది, అమెరికాలో 105,470 కేసులు ఉన్నాయి.. కానీ యుఎస్ లో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి.. ఇక్కడ కేవలం 1,700 మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా దేశాల మరణాల కంటే ఇటలీలో ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? అని చాలా మందికి వచ్చిన సందేహం.. దాని మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎందుకు ఎక్కువగా ఉంది? అంటే.. వాస్తవానికి ఇటలీలో వ్యాధి నిరోధక శక్తీ కూడా ఎక్కువ.. అంతేకాదు.. ఇటలీలో దేశంలోని వృద్ధుల జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది.. వైరస్‌ కూడా ఎక్కువ శాతం వృద్ధులకే సోకుతోంది పైగా చనిపోయే వారిలో కూడా 80 శాతం వృద్ధులే ఉన్నారు.

దీనికి తోడు అంటువ్యాధుల గురించి పూర్తి సమాచారాన్ని ఇటలీ ప్రభుత్వం ఇవ్వలేదు. దాంతో పరీక్షా కేంద్రాలు లిమిటెడ్ గా ఉన్నాయి.. ఈ క్రమంలో వైరస్ సోకిన వారు ఎక్కువ రోజులు జనాల మధ్య గడిపారు.. ఈ కారణాలతో ఇటలీలో డెత్ రేట్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. పరీక్షలు చేసే ఆరోగ్య కార్యకర్తలకు ఒక ప్రధాన అడ్డంకి, పరిమిత రక్షణ గేర్ అందుబాటులో ఉందని అంటు వ్యాధి విభాగం అధిపతి డాక్టర్ మాసిమో గల్లి అన్నారు. అనుమానిత కేసులు కూడా కాకుండా చాలా తీవ్రమైన కేసులు మాత్రమే పరీక్షించబడుతున్నాయని ఇది కూడా అధిక డెత్ రేట్స్ కు కారణమని ఆయన అన్నారు.


Tags:    

Similar News