RBI Stops Printing 2000 Rs. Note: 2 వేల నోట్ల విషయంలో ఊహించని ట్విస్ట్..ఆర్బీఐ సంచలన నిర్ణయంతో ఆగిన..

Update: 2019-10-16 06:11 GMT

అనుమానించినట్లే జరుగుతోంది. 2 వేల నోట్ల విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. ఏటీఎంలలో కళకళలాడుతూ వచ్చిన 2 వేల నోట్లు ఎందుకు రావడం లేదో తెలిసిపోయింది. పెద్ద నోట్లను రద్దు చేసి తీసుకొచ్చిన పెద్ద నోటు వ్యవహారం త్వరలో కథ కంచికి చేరుతుందట. పింక్ నోటు ను బ్యాన్ చేస్తున్నారంటు వచ్చిన అనుమానాలపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రెండు వేల రూపాయల నోటును బ్యాన్ చేయకుండా ప్రస్తుతం ఆ నోటు ప్రింటింగ్ ను మాత్రమే ఆపేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో 2 వేల నోటును ఒక్కదాన్ని కూడా తాము అచ్చేయలేదని వెల్లడించింది.

నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3వేల 542 మిలియన్ల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ 2017-18 ఆర్థిక సంవత్సరంలో నూట పదకొండు మిలియన్ నోట్లు ముద్రించారు.ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 46 మిలయన్లకు ఈ ముద్రనను కుదించారు. ఈ ఏడాది మాత్రం ఒక్క 2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. నల్లధనాన్ని అడ్డుకోడానికి వీలుగా వాటి ముద్రణను అటకెక్కడంతో రానున్న రోజుల్లో మాయమవుతుందని తెలుస్తోంది.

2వేల దొంగ నోట్లను ప్రింట్ చేసే కుట్రలు ప్రారంభమయ్యాయని దాని వెనుక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న తరుణంలో నోట్ల ముద్రణ ఆపేయడం జరిగిందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. గత మూడేళ్లలో 50 కోట్ల నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చాలా యూరోపియన్ దేశాల్లో నల్లధనానికి బ్రేక్ వేసేందుకు ఇలా పెద్ద నోట్లను అప్పుడప్పుడు రద్దు చేస్తుంటారని తెలిపారు. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు ఇకముందు ఈ రెండు వేల నోటు ముద్రణ కాదని వారు చెప్తున్నారు. మరి 2 వేల నోట్లు రద్దు అవుతాయా కొనసాగుతాయా అనే దానికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 

Tags:    

Similar News