Ranveer Singh: భర్తకు దీపిక కాస్ట్లీ గిఫ్ట్.. ఏకంగా రూ.4.57 కోట్ల లగ్జరీ కారు!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో రణ్‌వీర్ సింగ్ తన పుట్టినరోజున అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. ఆ గిఫ్ట్ కూడా ఎవరి నుంచి అంటే?
Ranveer Singh: భర్తకు దీపిక కాస్ట్లీ గిఫ్ట్.. ఏకంగా రూ.4.57 కోట్ల లగ్జరీ కారు!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో రణ్‌వీర్ సింగ్ తన పుట్టినరోజున అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. ఆ గిఫ్ట్ కూడా ఎవరి నుంచి అంటే? ఆయన సతీమణి దీపికా పదుకొణె నుంచి! తన భర్తకు ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీపిక ఏకంగా రూ.4.57 కోట్ల విలువైన హైఎండ్ లగ్జరీ EV కారుని గిఫ్ట్‌గా ఇచ్చింది.
రణ్‌వీర్‌కి కార్లంటే అసాధారణమైన మక్కువ ఉంది. తనకు నచ్చిన కార్లను వెంటనే తన గ్యారేజీలోకి చేర్చుకునే అలవాటు ఉంది. దీపిక కూడా ఈ విషయం బాగా తెలుసు కాబట్టి, రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా అతనికి ఎంతో ఇష్టమైన లగ్జరీ కారు కానుకగా ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆ కారులో ముంబై వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఇక వర్క్ ఫ్రంట్‌లో దీపిక పదుకొణె కూడా ఫుల్ బిజీగా ఉంది. తాజాగా స్పిరిట్ సినిమాలో ఆమెను తొలగించినా, అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అదీకాక, కల్కి 2లో కూడా కీలక పాత్రలో నటించనుంది. తల్లి అయినప్పటికీ, వరుస సినిమాలతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
అటు రణ్‌వీర్ సింగ్ కూడా భారీ బడ్జెట్ చిత్రమైన "దురంధర" సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఈ జంట మధ్య ఉన్న ప్రేమ బంధం, స్పెషల్ గిఫ్టులు ఇప్పుడు అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి.