Rajasthan: పెండ్లి కొడుకా మజాకా... 51 ట్రాక్టర్లతో పెళ్లికూతురు ఇంటికి వివాహ ఊరేగింపు

Rajasthan: రాజస్ధాన్ పెళ్లికొడుకు వెరైటీ ఆలోచన.. స్వయంగా ట్రాక్టర్‌ నడిపిన వరుడు

Update: 2023-06-14 05:30 GMT

Rajasthan: పెండ్లి కొడుకా మజాకా... 51 ట్రాక్టర్లతో పెళ్లికూతురు ఇంటికి వివాహ ఊరేగింపు

Rajasthan: సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్‌లోనే, ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి చేరుకుంటాడు. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఓ పెండ్లి కొడుకు మాత్రం అందరిలా కాకుండా భిన్నంగా పెండ్లిపిల్ల గ్రామానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్‌ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్‌ బార్మర్‌లో జరిగింది.

బర్మేర్‌లోని సేవినియల గ్రామానికి చెందిన జేతారామ్‌ అనే యువ రైతుకు బొర్వా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. వధువు గ్రామంలో వివాహం కావడంతో వినూత్నంగా ఊరేగింపుగా వెళ్లాలని భావించాడు. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు అందుకోసమే ఈ ఆలోచన చేశానని వరుడు తెలిపాడు.

Tags:    

Similar News