పండుగ సీజ‌న్‌లో ప్ర‌త్యేక రైళ్ల‌ు : రైల్వే శాఖ

పండుగలను పురష్కరించుకొని ప్రయాణికుల రద్ధీ దృశ్యా రైల్వేశాఖ‌ ప్రత్యేక ట్రైన్స్ ను నడపనుంది

Update: 2019-10-25 08:44 GMT

దీపావళి, క్రిస్మస్ పండుగలను పురష్కరించుకొని ప్రయాణికుల రద్ధీ దృశ్యా రైల్వేశాఖ‌ ప్రత్యేక ట్రైన్స్ ను నడపనుంది. దాదాపు 200 ప్రత్యేక రైళ్లు, సుమారు 2500 అదనపు ట్రిప్పులు వేస్తున్నాట్టు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులకు సంబంధిత రైళ్లకు చెందిన సమాచారం అందించేందుకు ముఖ‌్యమైన స్టేషన్లకు హైల్ప్ డెస్కులు పనిచేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

రిజర్వేషన్ లేని బోగీల వద్ద ప్రయాణికులను క్రమ పద్దతిలో పంపేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. కొత్తగా నడపనున్న రైళ్లన్ని ఢిల్లీ, కోల్‌కతా, గోరక్‌పూర్ , చాప్రా, పాట్నా స్టేషన్లకు ప్రత్యేక ట్రైన్స్ నడపనున్నాయి. వివిధ రైల్వే జోన్లలోనూ ప్రత్యేక రైళ్లను నుడుపుతున్నామని రైల్వే శాఖ తెలిపింది.

Tags:    

Similar News