రైల్వే టికెట్టు బుకింగ్ నకు కొత్త రూల్స్.. పూర్తిస్తాయి సమాచారమిస్తేనే టిక్కెట్టు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2020-06-06 09:48 GMT

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. రైల్వే లో సైతం టికెట్ బుకింగ్ సమయంలో చిరునామాతో పాటు ఇతర వివరాలను ఖచ్చితంగా ఇవ్వాలంటూ షరతులు విధించింది.

లాక్‌డౌన్‌ -5.0లో భాగంగా కేంద్రం రైలు ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. కేవలం కన్ఫార్మ్ టికెట్లు కలిగిన వారు మాత్రమే రైళ్లలో ప్రయాణం చేయడానికి అనుమతిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసులు అందిస్తోంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వేశాఖ తాజాగా రిజర్వేషన్ టికెట్ ఫామ్‌లో పలు మార్పులు చేసింది.

టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రతి ప్రయాణీకుడు కచ్చితంగా అదనపు సమాచారం అందించాల్సి ఉంటుంది. పూర్తి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి నెంబర్ సహా..వీధి, కాలనీ, సిటీ, జిల్లా ఇలా అన్ని వివరాలు అందించాలి. మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ రిజర్వేషన్ కౌంటర్ ఇలా ఏ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్నా ఈ సమాచారం అందించాల్సిందే. అయితే, ఇలా ఫాం నింపుకుంటూ కూర్చుంటే టికెట్స్ అయిపోతాయనే భయం పట్టుకుంది. దీంతో అలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కేవలం 70 సెకన్లలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ సమాచారం తప్పక ఇవ్వాల్సిందేనని సూచించారు. ఇక టికెట్ క్యాన్సిల్ విధానాలు ఎప్పటిలాగే ఉంటాయని స్పష్టం చేశారు. రైలు బయలుదేరడానికి 4 గంటలలోపు టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్ పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. 


Tags:    

Similar News