RailOne App: టికెట్ నుంచి ఫుడ్ వరకు ఒక్క యాప్‌లోనే! రైల్‌వన్‌లో కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయ్

ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం కొత్తగా ‘RailOne’ అనే సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ స్టేటస్ చెక్ చేయడం వంటి అనేక సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంది.

Update: 2025-07-03 16:28 GMT

RailOne App: టికెట్ నుంచి ఫుడ్ వరకు ఒక్క యాప్‌లోనే! రైల్‌వన్‌లో కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయ్

RailOne App: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం కొత్తగా ‘RailOne’ అనే సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ స్టేటస్ చెక్ చేయడం వంటి అనేక సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ నుంచి ఉపయోగించే విధానం వరకు అన్నీ సులభంగా, ఉపయోగకరంగా రూపొందించబడ్డాయి.

ఎలా రిజిస్టర్ చేయాలి?

గూగుల్ ప్లేస్టోర్ లేదా iOS యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయండి

యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి

IRCTC రైల్ కనెక్ట్ లేదా UTS అకౌంట్‌తో లాగిన్ అవ్వొచ్చు

మూడవ పక్షాల క్రెడెన్షియల్స్ లేకుండా గెస్ట్ లాగిన్ ఉపయోగించవచ్చు

m-PIN లేదా బయోమెట్రిక్ లాగిన్‌కు అవకాశం ఉంది

యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది

రైల్‌వన్ యాప్ కీలక ఫీచర్లు:

రిజర్వుడ్ టికెట్ బుకింగ్

తత్కాల్ టికెట్ బుకింగ్

జనరల్ (అన్‌రిజర్వ్డ్) టికెట్లు

సీజన్, ప్లాట్‌ఫాం టికెట్లు

రైలు లైవ్ స్టేటస్, PNR స్టేటస్

కోచ్ పొజిషన్, రైలు ట్రాకింగ్

ఫుడ్ ఆర్డర్ చేయడం

ఫిర్యాదుల నమోదు, ఫీడ్‌బ్యాక్

రైల్ మదత్ ద్వారా హెల్ప్

R-వాలెట్‌లో డబ్బులు జమ చేసి బుకింగ్స్

3% తగ్గింపు‌తో అన్ రిజర్వుడ్ టికెట్లు

 తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు:

జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ఆధారిత OTP తప్పనిసరి

మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్లకు మాత్రమే బుకింగ్ లభిస్తుంది

కౌంటర్ లేదా అథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేస్తే కూడా ఆధార్-OTP తప్పనిసరి

రిజర్వేషన్ చార్ట్‌లో మార్పు:

ఇప్పటివరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ రెడీ అయ్యేది

ఇకపై 8 గంటల ముందే చార్ట్ రెడీ అవుతుంది

టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదో ముందుగానే తెలుస్తుంది

మొత్తం మీద రైల్‌వన్ యాప్ అనేది ఒక ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారంగా పనిచేస్తోంది. రైలు ప్రయాణం కోసం అవసరమైన ప్రతీ అంశం – టికెట్, ఫుడ్, ట్రాక్, ఫిర్యాదులు – అన్నీ ఒకే యాప్‌లో పొందొచ్చు.

అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ ప్రయాణికులకు బాగా ఉపయోగపడనుంది.

Tags:    

Similar News