రాహుల్‌ గాంధీకి ఝలక్ ఇచ్చిన లోక్‌సభ సెక్రటేరియెట్

Update: 2019-06-10 16:18 GMT

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియెట్ ఝలక్ ఇచ్చింది. 17వ లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలకు కేటాయించే భవనాల వివరాలను లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో రాహుల్ గాంధీ బంగ్లా కూడా ఉండటం చర్చనీయాంశమైంది. ఢిల్లీ తుగ్లక్‌ లేన్‌లో ఉన్న రాహుల్ బంగ్లా టైప్ ఎయిట్ కేటగిరిలోకి వస్తుంది. ఈ కేటగిరికి చెందిన బంగ్లాలను కేబినెట్ మంత్రులకు మాత్రమే కేటాయిస్తారు. తాజాగా కేబినెట్ మంత్రులకు కేటాయిస్తూ జారీ చేసిన బంగ్లాల జాబితాలో రాహుల్ గాంధీ నివాసాన్ని చేర్చారు. అయితే, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని రాహుల్ గాంధీ కార్యాలయం చెబుతోంది.

Full View 

Tags:    

Similar News