Rahul Gandhi: కొత్త సంవత్సరం వేడుకలు.. తల్లితో కలిసి రాహుల్‌ ప్రత్యేక వంటకం

Rahul Gandhi: ఆరెంజ్‌ మార్మలాడే అనే రెసీపీ ప్రీపరేషన్‌

Update: 2023-12-31 13:42 GMT

Rahul Gandi: కొత్త సంవత్సరం వేడుకలు.. తల్లితో కలిసి రాహుల్‌ ప్రత్యేక వంటకం

Rahul Gandhi: న్యూ ఇయర్ వేడుకలను కాస్త డిఫరెంట్ ప్లాన్ చేశారు రాహుల్ గాంధీ. తల్లి సోనియాతో కలిసి వంట చేశారు. ఆరెంజ్‌ మార్మలాడే అనే రెసీపీ ప్రీపరేషన్‌తో గడిపారు. ఈ వంటకం రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ ఛానెల్‌ పోస్ట్‌ చేశారు.నిత్యం దేశ రాజకీయాల్లో తలమునకలై ఉండే తల్లీ కొడుకులు కాసేపు కిచెన్‌లో గడిపారు. గార్డెన్‌లోకి వెళ్లి పండ్లను తెచ్చి, వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్‌ తీశారు. ఆ జ్యూస్‌ని, చక్కెరని మిశ్రమం చేసి స్టవ్‌పై ఉడికించారు.

తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని సోనియా గాంధీ అందులో చెప్పారు. ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. రాహుల్‌ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్‌ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా అని సరదాగా అన్నారు రాహుల్‌. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్‌ వేశారు.

మంచిది అప్పుడు ఆ జామ్‌ మొత్తం మనకే సొంతం అని రాహుల్‌ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్‌ చేసి పైన ఒక లవ్‌ సింబల్‌ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్‌ అని రాశారు. 

Tags:    

Similar News