వలస కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. డాక్యుమెంటరీ విడుదల

లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు ఎదుర్కొంటున్న బాధలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Update: 2020-05-23 06:02 GMT
Rahul Gandhi

లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు ఎదుర్కొంటున్న బాధలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈనెల 16న ఆయన ఢిల్లీలో వలస కూలీలను కలిశారు. శనివారం ఉదయం 9 గంటలకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కార్మికులకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. కాగా గత శనివారం ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ ఫ్లైఓవర్ సమీపంలో వలస కార్మికులను కలిసిన రాహుల్.. దాదాపు 30 నిమిషాల పాటు అక్కడే ఉండి వారి బాధలు తెలుసుకున్నారు, కష్టాలను విన్నారు.. అనంతరం పేవ్మెంట్ మీద వలసకూలీలతో మాట్లాడిన అనంతరం వారికి అవసరమైన మాస్కులు, ఆహారం, నీరు ఇచ్చారు.

అంతేకాదు వాహనాలను తీసుకువచ్చి కొంతమంది కార్మికులను ఇంటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ పేరు పెట్టకుండా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ టార్గెట్ చేశారు. "వలస వచ్చినవారు కాలినడకన వెళ్ళేటప్పుడు, వారితో మాట్లాడటానికి బదులు వారి పిల్లలతో లేదా వారి సూట్‌కేసులతో నడవడం మంచిదని అన్నారు. తాను ఈ విషయాన్ని బాధతో చెప్పగలనని, తాను హాయిగా చెప్పగలిగినప్పటికీ. ఎక్కువ రైళ్లు కావాలని వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని ఎందుకు అడగవు అని ప్రశ్నించారు.


Tags:    

Similar News