Rahul On Lorry: అర్థరాత్రి హైవేపై లారీని ఆపి రాహుల్ గాంధీ ఏం చేశాడంటే?

Rahul On Lorry: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకం అవుతున్నారు.

Update: 2023-05-23 08:32 GMT

Rahul On Lorry: అర్థరాత్రి హైవేపై లారీని ఆపి రాహుల్ గాంధీ ఏం చేశాడంటే?

Rahul On Lorry: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకం అవుతున్నారు. దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 5 నెలలపాటు చేపట్టిన ఈ సుదీర్ఘ యాత్రలో రాహుల్ 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తన అస్థిత్వాన్ని కోల్పోతున్న తరుణంలో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రతో ఆ పార్టీలో సరికొత్త ఉత్సాహం మొదలైంది. ఇక తాజాగా కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందడంతో కాంగ్రెస్ లో నయా జోష్ తొణికిసలాడుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మరో విలక్షణ పని చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో డెలివరీ బాయ్ తో కలిసి రాహుల్ స్కూటర్ పై ప్రయాణించారు. అంతేకాదు, ఆర్టీసీ బస్ లో కూడా కామన్ మ్యాన్ మాదిరి ట్రావెల్ చేశారు. దేశంలోని చిన్నవర్గాల ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ ఇందులో భాగంగానే తాజాగా లారీ డ్రైవర్లత మమేకం అయ్యారు. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు వెళుతున్న రాహుల్ హర్యానాలోని సోనిపేటలోని ఓ ధాబా వద్ద ఆగారు. అక్కడ లారీ డ్రైవర్లను కలుసుకొని వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలపై మరింత అవగాహన కోసం లారీలోనే అంబాలాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే లారీలో ప్రయాణించారు. అలా దారి పొడవునా లారీ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు, ఢిల్లీ నుంచి అంబాలాకు వెళ్తున్న హైవే పై పలు వాహనాల డ్రైవర్లు తమను దాటుకుంటూ వెళ్తున్న లారీలో రాహుల్ ఉన్నాడని గమనించిన డ్రైవర్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇతర వాహనాల నుంచి తనను పలకరిస్తున్న వారి వైపు రాహుల్ చేయి ఊపుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ట్రక్ డైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే రాహుల్ ఇలా ప్రయాణం చేశారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ వీడియోని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 


Tags:    

Similar News