Rahul Gandhi: రాయ్‌బరేలీలో సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ ప్రచారం
Rahul Gandhi: పెళ్లి ఎప్పుడంటూ రాహుల్ ప్రశ్నించిన అభిమానులు
Rahul Gandhi: రాయ్‌బరేలీలో సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ ప్రచారం
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే సభకు వచ్చిన జనం ఓ ప్రశ్న వేశారు. దాని గురించి స్టేజ్ మీద ఉన్న ప్రియాంకా గాంధీ.. రాహుల్‌కు చెప్పింది. సభకు వచచిన జనానికి ముందు సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు. అప్పటికే ప్రసంగాన్ని ముగించిన రాహుల్.. సోదరి ప్రియాంకా చెప్పిన విషయాన్ని గమనించి బదులిచ్చారు. జనం పెళ్లి గురించి అడుగుతున్నట్లు ప్రియాంకా చెప్పగానే.. మీరేమి అడగాలనుకుంటున్నట్లు రాహుల్ మైక్‌లో అడిగారు. ఆ తర్వాత చిరు నవ్వు చిందిస్తూ.. ప్రశ్న ఏంటో అడగండి అంటూనే ఆయన ఓ విషయాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు తొందరల్లోనే చేసుకోవాల్సి ఉంటుందని పెళ్లి గురించి రాహుల్ కామెంట్ చేశారు. అబ్ జల్డీ కర్నీ పడేగి అంటూ వ్యాఖ్యానించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.