Amit Shah: ఈవీఎం వల్లే ఓడిపోయామని రాహుల్ ప్రకటిస్తారు
Amit Shah: కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Amit Shah: ఈవీఎం వల్లే ఓడిపోయామని రాహుల్ ప్రకటిస్తారు
Amit Shah: కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇండియా బ్లాక్ ఓటమి తర్వాత రాహుల్, అఖిలేష్‌లు ప్రెస్‌మీట్ పెట్టి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. ఈవీఎం కారణంగానే తాము ఓడిపోయామని చెబుతారని ఆరోపించారు అమిత్ షా. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
పీఓకే భారత్‌లో అంతర్భాగమని, పీఓకేను బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ దేశాన్ని భయపెడుతున్నదని అన్నారు. తాము బీజేపీ వ్యక్తులమని, అణుబాంబులకు భయపడబోమని, పీఓకేను తిరిగి వెనక్కితీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.