సంపూర్ణ భారత్ లాక్ డౌన్.. ప్రధాని మోడీ

Update: 2020-03-24 14:41 GMT
Prime Minister Narendra Modi

దేశం మొత్తం 21 రోజులు లాక్ దౌన్ ప్రకటిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ఈ 21 రోజులు ఎవరూ బయటకు రావద్దని అయన సూచించారు. కరోనా నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం.. మీకోసం ఈ నిర్ణయం. మీ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం అని ప్రధాని జాతి ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకటించారు.

కఠినంగా ఉండాల్సి వస్తోందని చెప్పిన ప్రధాని.. కరోనా ను ఎదుర్కోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదన్నారు. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు మొట్టమ లాక్ అవ్వాల్సిందే అని ప్రధాని చెప్పారు. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం అని చేపారు. ఈ లాక్ దౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ అని చెప్పారు. 

ప్రధాని మోడీ కామెంట్స్...

♦ ఈ రోజు అర్ధరాత్రి నుండి భారత్ దేశం మొత్తం లాక్ డౌన్

♦ ఇది ఒక విధమైన కర్ఫ్యూ లాంటిదే

♦ జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇది

♦ ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం

♦ ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందే

♦ వచ్చే 21 రోజుల పాటు ఈ నిర్బంధం అమలులో ఉంటుంది

♦ కరోనా మహమ్మరిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదు.

♦ లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది

♦ మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖ గీయండి.

Tags:    

Similar News