PM Modi: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దాం

Update: 2020-03-19 15:04 GMT
Narendra Modi

కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈరోజు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ గురించి భారత దేశం తీసుకుంటున్న నివారణ చర్యలు వివరించడంతో పాటు దేశ పౌరులు రానున్న రోజులల్లో ఎలా వ్యవహరించారో చెప్పారు. ప్రధాని మోడీ జాతి నుద్దేశింది చెప్పిన విషయాలు ఇవే!

- ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

- ప్రపంచ మహమ్మారి నుంచి ఇప్పుడే ఊరట లభించే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే!

- రెండు నెలలుగా భారతదేశ ప్రజలంతా కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇది మరి కొన్నాళ్ళు కొనసాగించాలి.

- దృఢ సంకల్పంతో, కలిసి కట్టుగా మాత్రమే కరోనాను ఎదుర్కోగలం

- కరోనా ను ఎదుర్కోవాలంటే ప్రజలు గుంపులుగా ఉండకూడదు.

- ఈ సమయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. అవసరం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.

- 60 ఏళ్లు పైబడిన వారు వచ్చే రెండు వారాల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.

- పౌరలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సూచనలు తప్పనిసరిగా పాటించండి.

- జనతా కర్ఫ్యూ పేరుతొ ఆదివారం (మార్చి 22) రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందరూ ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ ఇది. దీనిని తప్పనిసరిగా పాటించండి. ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు విధించుకునే కర్ఫ్యూ అని.. కరోనాపై అతిపెద్ద యుద్ధమని మోదీ తెలిపారు. జనతా కర్ఫ్యూ గురించి ప్రతి ఒక్కరూ పది మందికి వివరించాలన్నారు. జనతా కర్ఫ్యూ ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. 



Full View


Tags:    

Similar News