Ramnath Kovind: ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర.. ఇక నుంచి దాడులు చేస్తే..

ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించే ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.

Update: 2020-04-23 05:05 GMT
Ram Nath kovind (File photo)

ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించే ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అంతేకాదు వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్ కూడా‌ విడుదల చేశారు. దీంతో తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టయింది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే..

దీనిని ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 సవరణ చేశారు.. దీనికి ప్రకారం మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, అలాగే రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. తీవ్ర దాడి జరిగి, బాధితులకు గాయాలు అయితే మాత్రం గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. అయితే కరోనాపై పోరాటం ముగిసిన తరువాత కూడా ఈ ఆర్డినెన్స్ అమలులో ఉంటుందా అనే విషయంపై స్పష్టత రావలసి ఉంది.


Tags:    

Similar News