బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్సీనిపై జేడీయూ ఉపాధ్యక్షుడు ,రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2019-12-22 11:39 GMT
PrashantKishor File Photo

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్సీనిపై జేడీయూ ఉపాధ్యక్షుడు ,రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలు శాంతియుత నిరసనలు చేయాలన్నారు. ఈ మేరకు ట్విట్ చేసిన ఆయన .. ప్రజలు, నాయకులు సోషల్ మీడియాలో శాంతియుత నిరసనలు తెలపాలని సూచించారు . బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏకం కావాలన్నారు. అందరూ కలిసి పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకించాలని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీపై ఆందోళనలు వ్యాక్తం మవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్ ఎన్‌ఆర్సీని బీహార్ లో అమలు చేయమని స్పష్టం చేశారు. కాగా.. బిహార్‌లో ఎన్‌ఆర్సీని అమలు చేయాల్సిన లేదని నితీష్‌ వ్యాఖ్యానించారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఎన్‌ఆర్సీని వ్యతిరేకించారు. బెంగాల్ లో ఎన్‌ఆర్సీని అమలు చేయమని తేల్చి చేప్పారు. దీనిపై ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని తెలిపారు. బీజేపీ చెందిన భాగస్వామ్య పక్ష్యాలన్ని ఎన్ఆర్‌సీ ఉభయ సభల్లో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

సీఏఏ వ్యతిరేకంగా దేశావాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లోని ముజఫర్‌నగర్‌లో ఆందోళనలు తీవ్ర రూపందాల్చాయి. ఆందోళన కారులు ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను సీజ్‌ చేసింది. దీంతో ముజఫర్‌నగర్‌లో 67 మంది షాపులు ప్రభుత్వం సీజ్ చేసింది. త్వరలో వాటిని వేలం వేయనున్నాట్లు ప్రకటించింది. వేలం ద్వారా వచ్చిన నగదులో నష్ట్రాన్ని పూరిస్తామని వెల్లడించింది. గతంలో బీజేపీకి వ్యుహకర్తగా  ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. తాజాగా ప్రశాంత్ కీషోర్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తు ట్విట్ చేశారు. 


 

Tags:    

Similar News