లారీలోని 39 మృతదేహాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

లండన్ లోని ఎసెక్స్‌కు చెందిన ఓ లారీలో 39 మృతదేహాలు బుధవారం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ లారీని అక్కడి పోలీసులు టిల్ బరీ డాక్స్ అనే ప్రాంతానికి తరలించారు.

Update: 2019-10-25 12:18 GMT

లండన్ లోని ఎసెక్స్‌కు చెందిన ఓ లారీలో 39 మృతదేహాలు బుధవారం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ లారీని అక్కడి పోలీసులు టిల్ బరీ డాక్స్ అనే ప్రాంతానికి తరలించారు. పోలీసుల విచారణలో మృతదేహాలకు చెందిన కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.మృతుల్లో 38మంది పెద్దవారు, మరో మృతదేహం యువకుడిదిగా పోలీసులు గుర్తించారు. 

పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీలోని మృతదేహాలు చైనాకి చెందిన పౌరులవని తెలుస్తోంది. అయితే వారిని కీరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలు పరిశీలించిన పోలీసులు శవపరీక్షలకు పంపించారు.అందరిని -25 డిగ్రీల శీతల ఉషోగ్రతలో ఉంచి వారి రక్తం గడ్డకట్టేలా చేసి ఆ తర్వాత వారిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మరిన్ని శవపరీక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 20ఏళ్ల కిందట కూడా 58 మృతదేహాలు తరలిస్తున్నలారీని డోవర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు.  

Tags:    

Similar News