పెళ్ళి పేరుతో చీటింగ్.. 32 మందిని పెళ్ళి చేసుకుని వారి సొమ్ముతో పరారైన అనిత అరెస్ట్
32 మందిని పెళ్లి చేసుకున్న అనిత అనే మహిళను న్యూఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.పెళ్లైన తర్వాత వరుడి ఇంట్లో విలువైన ఆభరణాలతో పారిపోయేది.
పెళ్ళి పేరుతో చీటింగ్.. 32 మందిని పెళ్ళి చేసుకుని వారి సొమ్ముతో పరారైన అనిత అరెస్ట్
ఒకరు కాదు ఇద్దరు కాదు 32 మందిని పెళ్ళి చేసుకుని వాళ్ళ బంగారు ఆభరణాలతో పరారైన అనితను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి ఆమె అనుసరించే ప్రణాళిక చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే.
పెద్దలతో పెళ్ళి కుదిర్చినట్లు మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడం. ఎక్కడా ఫోటోల్లో, వీడియో ముఖం కనిపించకుండా వరుడి వెంట వెళ్ళిపోవడం. ఆ తరువాత వారి ఇంట్లో దొరకిందంతా దోచుకుని పరారైపోవడం, కొంత కాలానికి మరో పెళ్ళికి ప్లాన్ వేయడం, మరో బకరాను బలి చేయడం.. ఇదీ ఆమె స్టయిల్.
కానీ, చివరికి ఆమె నాటకం బయటపడింది. దిల్లీ పోలీసులకు పట్టుబడింది.
అనిత చేసుకున్న పెళ్లిళ్లన్నీ పెద్దలు కుదిర్చినవే.పెళ్లి సంబంధాలు మాట్లాడే సమయం నుండి ముందు జాగ్రత్తలు తీసుకొనేది. కొత్త కొత్త పేర్లతో వరుడి కుటుంబ సభ్యులను ఆమె మోసం చేసేది. తన పోలికలను గుర్తించకుండా కూడ జాగ్రత్తలు తీసుకొనేది.
పెళ్లి తర్వాత సంప్రదాయం ప్రకారంగా నిర్వహించే కార్యక్రమాలకు రకరకాల కారణాలను చూపి దూరంగా ఉండేది. అదే సమయంలో వరుడి ఇంట్లో విలువైన వస్తువులను దోచుకొనేందుకు మార్గాలను అన్వేషించేది.సమయం చూసి వరుడి ఇంట్లో విలువైన వస్తువులతో ఉడాయించేది.
రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్ వారా జిల్లాలోని సంగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తితో వివాహం చేసుకొని అనిత జంప్ అయింది. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిత ఢిల్లీలో పోలీసులకు చిక్కింది.
ఈ పెళ్లిళ్ల వెనుక అనితకు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2022లో మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో కూడా ఓ మహిళ ఇదే రకమైన కేసులో మరో అరెస్టయింది.