నేడు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
నేడు మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.
నేడు మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.ఇందులో ప్రధానంగా లాక్ డౌన్ పైనే చర్చ జరగనుంది. మే మూడో తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే విషయంపై సీఎంల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తీసేస్తే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా సమావేశంలో చర్చిస్తారని సమాచారం.
ఇక ఈ భేటీలో మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే హాట్‌స్పాట్లు లేని పలు ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ఇచ్చిన సడలింపులు అమలు చేయడం లేదు. కొందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని కూడా కోరుతున్నారు.