New Year 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. 2026 అందరికీ విజయవంతంగా ఉండాలని ఆకాంక్ష
New Year 2026: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
New Year 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. 2026 అందరికీ విజయవంతంగా ఉండాలని ఆకాంక్ష
New Year 2026: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిస్తున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో సమయానికి ప్రజలు పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా సందేశం విడుదల చేశారు. “ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభించాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజం శాంతి, ఆనందాలతో నిండివుండాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని సందేశానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు ప్రముఖులు, నాయకులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ఏడాదిపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.