అయోధ్య తీర్పుపై మాట్లాడకండి: మోదీ

ఈక్రమంలో అయోధ్య అంశంపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు సూచించారు.

Update: 2019-11-07 09:55 GMT

దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఆయోధ్య రామ్ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం 40 రోజులు వరసగా విచారణ చేసింది. అక్టోబరు 16న ఇరు పక్షాల వాదనలను విన్న కోర్డు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అయితే తీర్పును ఈనెల 17న వెలువడనుంది అదే రోజు రంజన్ గొగొయ్ పదవీవిరమణ చేయనున్నారు‎. ఈనేపథ్యం టీవి చర్చ కార్యక్రమాలు , రెచ్చకొట్టే ప్రసంగాలు చేయకుడదని పోలీసులు పలు ఆంక్షలు విధించారు. సామాజిక మాధ్యమాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

ఈక్రమంలో అయోధ్య అంశంపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు సూచించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అయోధ్య కేసు సున్నితమైన అంశమని శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉటుందని మోదీ తెలిపారు.

వివాదాస్పద స్థలం అయోధ్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును అన్ని వర్గాలు ఎలా గౌరవించాయో తన సహచర మంత్రులకు మోదీ గుర్తుచేశారు. ఈ కేసు వెలువడిన అనంతరం ధర్మాసనం ఇచ్చిన తీర్పుగా చూడాలని అన్నారు. దీంతో బీజేపీ కార్యవర్గం తమ పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. భావోద్వేగ ప్రకటనలు, రెచ్చగొట్టే‎ ప్రసంగాలు చేయవద్దని ఆదేశించింది.

గత రెండు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ ‎ఇలాంటి సూచనలు చేసింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన వ్యతిరేకంగా వచ్చినా వచ్చినా సంయమనం పాటించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంబరాలకు దూరంగా ఉండాలని సూచించింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిసెంబర్ 10 వరకు 144 సెక్షన్ అమల్లోకి రానుంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఆంబేద్కర్‌ నగర్‌ జిల్లాలోని పలు కళాశాలలను తాత్కాలిక జైళ్లుగా మారుస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

Tags:    

Similar News