సైన్స్‌లో విజయాలు మాత్రమే ఉంటాయి : మోదీ

కోల్‌కతాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఐదో సైన్స్ ఫెస్టివల్‌ను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.

Update: 2019-11-05 14:08 GMT

కొత్త ఆలోచనలు ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రొత్సాహిస్తుందని ప్రధనా మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్‌లోకి కోల్‌కతాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఐదో సైన్స్ ఫెస్టివల్‌ను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ చరిత్ర ఎంతో విలువైనది, ప్రస్తుత కాలం శాస్త్ర సాంకేతికత మూడిపడి ఉంది. భవిష్యత్తు బాధ్యతలతో కూడిందని మోదీ అన్నారు. దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు ఉన్నారని తెలిపారు.

దేశంలో కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం అవసరమని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆ దిశగా ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో ప్రతి ఒక్క శాస్త్రవేత్త ఎంతో శ్రమించారని, మంచి ఫలితం ఆశించారని, అయినప్పటీకీ మిషన్  విజయం సాధించిందని మోదీ చెప్పారు. సైన్స్ లో పరాజయాలు ఉండవు, విజయాలే ఉంటాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని మోదీ తెలిపారు. 

Tags:    

Similar News