PM Modi: సూరత్‌లో డైమండ్ బోర్స్ బిల్డింగ్ ప్రారంభించిన మోడీ
PM Modi: భారతదేశంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్‌గా డైమండ్ బోర్స్
PM Modi: సూరత్‌లో డైమండ్ బోర్స్ బిల్డింగ్ ప్రారంభించిన మోడీ
PM Modi: దేశంలో డైమండ్స్ బిజినెస్ అంటే అందరికీ గుర్తొచ్చేది సూరత్. ఎందుకంటే, దేశంలో వజ్రాభరణాలకు పెట్టింది పేరు సూరత్. డైమండ్స్ బిజినెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సూరత్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించారు ఓ వ్యాపారి. సూరత్‌లో నిర్మించిన డైమండ్ బోర్స్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు ప్రధాని మోదీ. డైమండ్ బోర్స్.. ఇదో అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్ లిఫ్ట్‌లు ఉన్నాయ్. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్ భవనంగా రికార్డ్ సృష్టించింది ఈ నిర్మాణం.
అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు-దిగుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటైల్ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్… ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడ ఉన్నాయ్. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్స్ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది. డైమండ్ బోర్స్ సెంటర్‌తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 80ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను.. సూరత్ డైమండ్ బోర్స్ అధిగమించిందన్నారు మోదీ. ప్రస్తుతం ఏటా 2లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా.. ఇప్పుడది 4లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కొత్త టెర్మినల్ భవనం డబుల్-ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, తక్కువ వేడిని పొందే డబుల్-గ్లేజింగ్ యూనిట్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం వంటి లక్షణాలను కలిగి ఉంది. ల్యాండ్‌స్కేపింగ్, సోలార్ పవర్ ప్లాంట్ కోసం రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించనున్నారు.అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా సూరత్‌లోని డైమండ్ బోర్స్ నిలువనుంది. ఇది వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉంటుంది. వారణాసిలోని కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో మోదీ పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రధాని ఆవాస్, పీఎం స్వానిధి, పీఎం ఉజ్వల వంటి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు అనుగుణంగా ప్రధాన మంత్రి నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం 2023ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక సోమవారం ఉదయం 10:45 గంటలకు ప్రధానమంత్రి స్వర్వేద్ మహామందిర్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు బహిరంగ కార్యక్రమంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని మోదీ విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో, మధ్యాహ్నం 2:15 గంటలకు రూ.19,150 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.