బిల్ గేట్స్ తో నరేంద్ర మోదీ చర్చలు!

కరోనా కట్టడి, దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.

Update: 2020-05-15 07:43 GMT

కరోనా కట్టడి, దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఇరువురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. కరోనావైరస్ మహమ్మారి నిర్మూలనకు ప్రపంచ స్పందన , శాస్త్రీయ ఆవిష్కరణపై సమన్వయం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఆరోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా భారతదేశం తన పోరాటంలో అనుసరించిన విధానాన్ని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.. తమ దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడుతున్నామని వ్యాఖ్యానించిన మోదీ, భౌతికదూరం, పరిశుభ్రత, మాస్క్ లు ధరించడం వంటి చర్యల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధాని బిల్ గేట్స్ కు తెలియజేశారు.

అలాగే ప్రభుత్వం తీసుకున్న మునుపటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు - ఆర్థిక విస్తరణ, ఆరోగ్య సేవలను చివరి వరకూ బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత , ప్రజల రోగనిరోధక శక్తిని పెంచడానికి భారతదేశ ఆయుర్వేద అవసరాన్ని ప్రోత్సాహించడం అనేవి కూడా ప్రధాని చర్చినట్టు తెలుస్తోంది. కాగా కరోనా కట్టడికి భారత్ చేస్తున్న సేవలను బిల్ గేట్స్ కొనియాడారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ నొక్కి చెప్పారు. ఇటు కరోనా కట్టడికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు.

Tags:    

Similar News