సీఎం ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Update: 2019-11-23 03:49 GMT
Devendra Fadnavis

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాత్రికి రాత్రే పరిణామాలు మారి ఎన్సీపీలో చీలిక ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్‌ సీఎంగా ప్రమాణం చేయగా డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఫడ్నవీస్, అజిత్ ఇద్దరు కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నానని అమిత్ షా తెలిపారు.




Tags:    

Similar News