Price Hike Effect: రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడు విలవిల

Price Hike Effect: ఏడాదిగా నిత్యం పెరుగుతునే ఉన్న చమురు ధరలు భారత్‌లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర

Update: 2021-06-13 11:30 GMT

Representational Image

Price Hike Effect: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం దానికి బిన్నంగా డీజిల్, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగిపోవడంపై విజయనగరం జిల్లావాసులేమంటున్నారో చూద్దాం.

గత సంవత్సర కాలంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విజయనగరం జిల్లాలో మద్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్పోరేటు సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోంది తప్పా సామాన్య జనాలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం లేదని, పెట్రోల్ ధరలు పెరగటంతో రవాణా వ్యవస్థపై పెను భారం పడి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

నానాటికి పెట్రోల్ ధరలు పెంచడం వల్ల రోజువారి కూలీల నుండి ఆటో రిక్షాలపై ఆదారపడి జీవిస్తున్న వారిపై పెనుభారం పడుతోంది. ఇకపై కూడా ఇలానే పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుంటే ఆటోలను అమ్మేసి రిక్షాలు తోలుకునే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుడి జీవనం కష్టంగా మారుతోందని ఇకనైనా కేంద్రం పెట్రోల్ ధరలను నియత్రించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం వాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News