నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Update: 2019-06-17 03:18 GMT

ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్రకుమార్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలుత ఎంపీగా ప్రధాని మోడీ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు, ప్యానెల్ చైర్మన్ల ప్రమాణం చేస్తారు. తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీల ప్రమాణాలు ఉంటాయి. మొదట అండమాన్ నికోబార్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నియోజకవర్గాల క్రమసంఖ్య ఆధారంగా ప్రమాణం చేయనున్నారు. ఏపీ నుంచి తొలుత అరకు ఎంపీ ప్రమాణం చేస్తారు. ఈ నెల 19న లోకసభ స్పీకర్ ఎంపిక, ఈ నెల 20న ఉభయ సభలకు చెందిన సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. జులై 5వ తేదీన కేంద్ర బడ్జెట్ ను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Tags:    

Similar News