ఎస్పీజీ చట్ట సవరణకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

Update: 2019-12-04 02:52 GMT
అమిత్ షా

దేశంలోని ప్రముఖులకు రక్షణ ను కల్పించే ఎస్పీజీ చట్టం సవరణ గొడవ ఎట్టకేలకు సర్దుమనిగింది. ఈ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే చట్ట సవరణ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నిరసనను తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రతిపక్షాలు చేసిన ఈ ఆరోపణలను హోం మంత్రి తిరస్కరించారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా హోం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క గాంధీ కుటుంబం గురించి మాత్రం కాదని, దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతపై ఆలోచనలను చేసిందని తెలిపారు. రాజకీయ కక్షతోనో, మరి ఇంక ఏ ఇతర కారణాల ద్వారానో భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అలాంటి నిర్ణయాలను తీసుకుందని ఈ సంర్భంగా ఆయన కాంగ్రెన్ ని విమర్శించారు.

మన దేశానికి మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్‌ల భద్రతలో భాగంగా ఎస్పీజీ చట్టంపై ఇలాంటి సమీక్షలు జరిగాయని, అప్పడు ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. హోం మంత్రి ఇచ్చిన ఈ సమాధానాలకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేసింది.

దేశ ప్రధాని స్థానంలో ఎవరు అధికారంలో ఉంటారో వారికి వారితో పాటు  ప్రధాని అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఈ చట్టం ద్వారా రక్షణ కల్పిస్తారని అమిత్ షా స్పష్టం చేసారు. వారి పదవీ కాలం అయిపోయిన వెంటనే ఈ రక్షణ సేవలను తొలిగిస్తామని సభలో స్పష్టం చేశారు. అయితే సందర్భంలోనే కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుల గురించి కూడా ప్రస్తావించారు.


Tags:    

Similar News