Viral News: మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మహారాష్ట్రలో భాషాపై వివాదం మరోసారి హైలైట్ అయ్యింది. పాల్‌ఘర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్‌పై శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) మద్దతుదారులు దాడి చేశారు. కారణం? అతడు తాను హిందీ లేదా భోజ్‌పురీలో మాత్రమే మాట్లాడతానని చెప్పినందుకు.

Update: 2025-07-13 12:51 GMT

జాతీయ మీడియా కథనాల ప్రకారం, వారం రోజుల క్రితం ఆ ఆటో డ్రైవర్ తన వాహనంలోని ప్రయాణికుడితో మాట్లాడుతూ తాను హిందీ లేదా భోజ్‌పురీలో మాత్రమే మాట్లాడతానని తేల్చి చెప్పాడు. ఎవరేం చేసినా తనకు భయం లేదని చెప్పడంతో, ఈ వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపాయి. అనంతరం శనివారం శివసేన (UBT), ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలు అతడిపై బహిరంగంగా దాడికి దిగారు. “మరాఠీ భాషను అవమానిస్తే చూస్తూ ఊరుకోం” అంటూ అతడిపై చెంపచాటు వేశారు. దాడిలో మహిళలు కూడా పాల్గొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో విరార్ సిటీ శివసేన (UBT) చీఫ్ ఉదయ్ జాదవ్ కూడా కనిపించారని కథనాలు చెబుతున్నాయి.

ఉదయ్ జాదవ్ స్పందన

ఈ ఘటనపై స్పందించిన ఉదయ్ జాదవ్, “మేము అసలైన శివసేన స్టైల్‌లో స్పందించాము. రాష్ట్రం, భాష, ప్రజలపై అవమానకరంగా మాట్లాడితే ఎవ్వరినీ వదిలేది లేదు” అన్నారు. “ఆ డ్రైవర్ మరాఠీ ప్రజల గురించి తప్పుగా మాట్లాడాడు. అందుకే తగిన బుద్ధి చెప్పాం. అతడి నుంచి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పించాం” అని వివరించారు.

పోలీసుల స్పందన

ఇంకా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. “వైరల్ వీడియోను చూశాము. అసలు విషయం తెలుసుకునేందుకు పరిశీలిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు” అని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు.

భాషా విధానంపై ఉద్రిక్తత

జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ బోధనపై మహారాష్ట్రలో ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రైమరీ పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని మరాఠీ భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒత్తిడికి లోనై ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించాల్సి వచ్చింది.

Tags:    

Similar News