కయ్యానికి కాలు దూస్తోన్న పాకిస్తాన్.. సామాన్య ప్రజలపై దాడికి దిగుతోన్న దాయాది దేశం

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాక్ చేసిన దాడులకు ప్రతిదాడులు చేస్తున్న భారత సైన్యాన్ని ఎదుర్కోలేక సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో సామాన్య ప్రజలపై పాక్ దాడులకు తెగబడుతుుంది.

Update: 2025-05-09 10:54 GMT

కయ్యానికి కాలు దూస్తోన్న పాకిస్తాన్.. సామాన్య ప్రజలపై దాడికి దిగుతోన్న దాయాది దేశం

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాక్ చేసిన దాడులకు ప్రతిదాడులు చేస్తున్న భారత సైన్యాన్ని ఎదుర్కోలేక సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో సామాన్య ప్రజలపై పాక్ దాడులకు తెగబడుతుుంది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసిన భారత సైన్యం.. ధాటికి పాక్ చతికిలపడుతుంది. తోకముడిచిన పాక్ భారత సామాన్య పౌరులే టార్గెట్‌గా జమ్ములోని ఫూంఛ్, రాఝౌరీ, పంజాబ్‌లోని భటిండా ప్రాంతాల్లో ఇళ్లపై కాల్పులకు పాల్పడుతోంది.

ఓవైపు పాక్‌పై ప్రతిదాడులు చేస్తూనే... మరోవైపు ప్రజలను అప్రమత్తం చేస్తుంది ఇండియన్ ఆర్మీ.. ప్రజలు ఎవరూ ఇళ్లు దాటి బయటికి రాకుండా.. బాల్కనీలకు దూరంగా ఇంట్లోనే సేఫ్ ప్రాంతంలో ఉండాలని హెచ్చరించారు. హరియానా, ఛండీఘడ్‌ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రాజస్థాన్, గుజరాత్‌ పంజాబ్‌ రాష్ట్రాల్లోని పాక్ సరిహద్దు జిల్లాలు, గ్రామాల్లో.. ఇప్పటికే కలెక్టర్లు.. ఉన్నతాధికారులు ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News