మరోసారి భారత గగనతలంపై పాక్‌ డ్రోన్ల కలకలం

భారత గగనతలంపై మరోసారి పాక్‌కు చెందిన డ్రోన్లను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. నిరంతరం పెట్రోలింగ్ జరుపుతున్న సిబ్బంది మూడు డ్రోన్లను కూల్చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Update: 2019-10-22 14:50 GMT

భారత గగనతలంపై మరోసారి పాక్‌కు చెందిన డ్రోన్లను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. నిరంతరం పెట్రోలింగ్ జరుపుతున్న సిబ్బంది మూడు డ్రోన్లను కూల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారత్ లోకి చొరబడేందుకు ముష్కరులు కొత్త దారులు వెతుకుతున్నాట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ , హుస్సేన్ వాలా సెక్టర్ లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. దీంతో పంజాబ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. 


సరిహద్దు దాటేందుకు అనువుగా ఉన్న దారిని తెలుసుకునేందుకు భారత గగనతలం వైపు పంపుతున్నారు. ఉగ్రవాదుల దగ్గర అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థన్ కు చెందిన ఐఎస్ఐ భారత్ లోకి ముష్కరులను పంపేందుకు ప్రయాత్నాలు చేస్తుందని నిఘా వర్గాల సమాచారం. సోమవారం రాత్రి ఓ డ్రోన్ ను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. 

Tags:    

Similar News